Skip to main content

భారత్, చైనా మధ్య 9వ విడత మిలటరీ చర్చలు ఎక్కడ జరిగాయి?

తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో 9వ విడత చర్చలు జరిగాయి.
Current Affairs
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద జనవరి 24న ఈ చర్చలు జరిగాయి. చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. 2020, నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి.

తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని భారత ఆర్మీ తెలిపింది. చైనా ప్రతిపాదన మేరకే 2020, సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో ఈ ఒప్పందం కుదిరింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : చైనా, భారత్ తొమ్మిదో విడత మిలటరీ చర్చలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, జనరల్ లియూ లిన్
ఎక్కడ : చూశుల్ సెక్టార్, తూర్పు లద్దాఖ్, భారత్-చైనా సరిహద్దు
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం
Published date : 26 Jan 2021 02:46PM

Photo Stories