Skip to main content

భారత భద్రతా బలగాలు, పౌరులపై పాకిస్తాన్ కాల్పులు

పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 13న సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది.
Current Affairs
ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి.

నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్ ఎస్‌ఐ రాకేశ్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : పాకిస్తాన్
ఎక్కడ : జమ్మూకశ్మీర్
Published date : 16 Nov 2020 05:55PM

Photo Stories