Skip to main content

భారత్‌ బయోటెక్‌తో సీఎస్‌ఐఆర్‌ ఒప్పందం

కోవిడ్‌ వంటి మహమ్మారులను అత్యంత సమర్థంగా ఎదుర్కొనేందుకు, వ్యాధులకు టీకాలు, బయో థెరప్యూటిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అత్యధిక ప్రాధాన్యమిస్తోందని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మాండే స్పష్టం చేశారు.
Current Affairsభారత్‌లో వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్‌ రూపుదిద్దుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో భారత్‌ బయోటెక్‌తో పాటు బయోవెట్, సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో ఉన్నత స్థాయి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని మార్చి 29న తెలిపారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
భారత్‌ బయోటెక్‌తో పాటు బయోవెట్, సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)
ఎందుకు : కోవిడ్‌ వంటి మహమ్మారులను అత్యంత సమర్థంగా ఎదుర్కొనేందుకు, వ్యాధులకు టీకాలు, బయో థెరప్యూటిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు
Published date : 31 Mar 2021 11:17AM

Photo Stories