భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ?
Sakshi Education
ఔషధ తయారీలో ఉన్న బ్రిటన్ సంస్థ జీఎస్‌కే(గ్లాక్సోస్మిత్‌క్లైన్)... మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్‌లో చేపట్టనుంది.
ఇందుకోసం వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మలేరియా టీకా(ఆర్‌టీఎస్, ఎస్/ఏఎస్01) తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోకు జీఎస్‌కే బదిలీ చేస్తుంది. అలాగే టీకా తయారీలో ఉపయోగించే సహాయ ఔషధాన్ని సరఫరా చేస్తుంది.
పైలట్ ప్రాజెక్టు కింద...
మలేరియా వ్యాక్సిన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా.. ప్రస్తుతం జీఎస్‌కే మలేరియా టీకాను ‘పాత్’ అనే యూఎస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థతో కలిసి ఘనా, కెన్యా, మలావి ప్రాంతాల్లోని ప్రజలకు పైలట్ ప్రాజెక్టు కింద ఒక కోటి డోసులను అందిస్తోంది.
మలేరియా వ్యాధి కారకము...
మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ‘ప్లాస్మోడియం(Plasmodium)’ అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : జీఎస్‌కే(గ్లాక్సోస్మిత్‌క్లైన్)
ఎందుకు : మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్‌లో చేపట్టేందుకు

Published date : 29 Jan 2021 04:52PM