Skip to main content

భారత్ బయోటెక్ చేతికి బెహరింగ్ వ్యాక్సిన్స్

గ్లాక్సోస్మిత్‌క్లిన్ (జీఎస్‌కే) ఏషియాకు చెందిన చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్ ను హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ కొనుగోలు చేసింది.
పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఈ మేరకుహైదరాబాద్ లో ఫిబ్రవరి 15న ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. చిరోన్ బెహరింగ్‌కు గుజరాత్‌లోని అంకళేశ్వర్‌లో రేబిస్ టీకా తయారీ కేంద్రం ఉంది.దీని వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల మోతాదులు (డోస్‌లు),కాగా భారత్ బయోటెక్ రేబిస్ టీకా ప్లాంట్ సామర్థ్యం కోటి డోస్‌లు.

ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లామాట్లాడుతూ... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ-అప్రూవ్‌‌డ అనుమతి పొందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్ ను 70 దేశాల్లో మార్కెట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 16 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్ కొనుగోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్ బయోటెక్
Published date : 16 Feb 2019 03:16PM

Photo Stories