భారత్, బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలు
Sakshi Education
ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విసృ్తతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి.
ఇందులో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జనవరి 25న జరిగిన కార్యక్రమంలో 15 ఒప్పందాలు చేసుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో రెండు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్‌ను కీలకమైన భాగస్వామిగా వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బొల్సనారో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యహాత్మక బందాలను విసృ్తతం చేయడానికి

Published date : 27 Jan 2020 05:24PM