Skip to main content

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు

భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. <b>మొత్తం ఏడు రంగాల్లో</b> పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Current Affairs ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య డిసెంబర్ 17న జరిగిన ఆన్‌లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్స్‌, వ్యవసాయం, ఇంధనం, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఈ ఒప్పందాలు కుదిరాయి.

తాజా సదస్సు సందర్భంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను మోదీదీ, హసీనా సంయుక్తంగా ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన చిల్హాటీ - హల్దీబారీ రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బంగ్లాదేశ్ రాజధాని: ఢాకా; కరెన్సీ: బంగ్లాదేశ్ టాకా
బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు: మోహమ్మద్ అబ్దుల్ హమీద్
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని: షేక్ హసీనా

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎందుకు : హైడ్రోకార్బన్స్‌, వ్యవసాయం, ఇంధనం, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటి కోసం
Published date : 18 Dec 2020 06:39PM

Photo Stories