Skip to main content

భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేబినెట్ ఆమోదం

దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి డిసెంబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairsఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. ఈటీఎఫ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

భారత్- 22 ఈటీఎఫ్ మాదిరిగా ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 05 Dec 2019 05:39PM

Photo Stories