Skip to main content

భారత అథ్లెట్ నిర్మలపై నాలుగేళ్ల నిషేధం

భారత అథ్లెట్ నిర్మల షెరాన్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అక్టోబర్ 9న ప్రకటించింది.
2018 జూన్‌లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిర్మల నిషేధిత ఉత్పేర్రకం తీసుకున్నట్లు తేలింది. దీంతో నిర్మలపై 2016, ఆగస్టు నుంచి నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ఏఐయూ పేర్కొంది. ఈ నిషేధం కారణంగా 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో గెలిచిన 400 మీటర్లు, 4×400 మీటర్ల రిలే స్వర్ణాలను నిర్మల కోల్పోయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత అథ్లెట్ నిర్మల షెరాన్‌పై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ)
ఎందుకు : డోపింగ్ పరీక్షలో విఫలమైనందున
Published date : 10 Oct 2019 06:07PM

Photo Stories