భారత ఆర్థిక వ్యవస్థపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ విశ్లేషణ
Sakshi Education
భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రికవరీ అవకాశాలు కనిపించడం లేదని ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2020 అప్‌డేటెడ్ నివేదిక పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థపై మరికొన్ని సంస్థల క్షీణ అంచనాలు ఇలా...
ఈ పరిస్థితుల్లో ఎకానమీ గత (2020, జూన్‌లో వేసిన) క్షీణ అంచనా 4 శాతాన్ని తాజాగా 9 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నేపథ్యంలో ఏడీబీ విడుదల చేసిన తాజా నివేదిక వివరాలను బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ యెసుయుకీ సవాడా సెప్టెంబర్ 15న తెలియజేశారు.
ఏడీఓలోని ముఖ్యాంశాలు...
- 2021-22 ఆర్థిక సంవత్సరం భారత్ 8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. రవాణా, సరఫరాలు, వ్యాపార కార్యకలాపాల క్రియాశీలతతోపాటు బేస్ ఎఫెక్ట్ (2020-21లో అతి తక్కువ క్షీణ రేటు) దీనికి కారణం.
- 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత నమోదుకాగా తాజా నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.
- ప్రభుత్వ పరంగా చూసినా, ఇటు ప్రైవేటు పరంగా చూసినా రుణ భారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు సాంకేతిక, మౌలిక పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.
- కరోనా వైరస్‌కు మాతృభూమి అయిన చైనా మాత్రం 2020లో 1.8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలున్నాయని ఏడీబీ అంచనా వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థపై మరికొన్ని సంస్థల క్షీణ అంచనాలు ఇలా...
సంస్థ | తాజా అంచనా | క్రితం అంచనా |
ఎస్‌అండ్‌పీ | - 9 |
|
గోల్డ్‌మన్ శాక్స్ | -14.8 | -11.8 |
ఫిచ్ | -10.5 | -5.0 |
మూడీస్ | -11.5 | -4.0 |
కేర్ | -8.2 | -6.4 |
ఇండియా రేటింగ్‌స | -11.8 | -5.3 |
ఎస్‌బీఐ ఎకోర్యాప్ | -10.9 | -6.8 |
Published date : 16 Sep 2020 05:22PM