భారత ఆర్చరీ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
Sakshi Education
భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ)పై 2019లో విధించిన నిషేధాన్ని ప్రపంచ ఆర్చరీ సమాఖ్య (డబ్ల్యూఏఎఫ్) కొన్ని షరతులతో ఎత్తివేసింది.
ఈ మేరకు జనవరి24న ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇకపై భారత ఆర్చర్లు స్వతంత్రంగా కాకుండా, జాతీయ పతాకం కింద అంతర్జాతీయ టోర్నీల్లో తిరిగి బరిలోకి దిగొచ్చు. ఏఏఐకు గతంలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, డబ్ల్యూఏఎఫ్ నిబంధనలు పాటించ లేదంటూ 2019లో డబ్ల్యూఏఎఫ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పాత కార్యవర్గం రద్దై తిరిగి ఎన్నికలు నిర్వహించడం, అందులో కేంద్ర మంత్రి అర్జున్ ముండా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఏఏఐపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఆర్చరీ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ప్రపంచ ఆర్చరీ సమాఖ్య (డబ్ల్యూఏఎఫ్)
ఎందుకు : ఏఏఐ నూతన కార్యవర్గం ఎన్నికైనందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఆర్చరీ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ప్రపంచ ఆర్చరీ సమాఖ్య (డబ్ల్యూఏఎఫ్)
ఎందుకు : ఏఏఐ నూతన కార్యవర్గం ఎన్నికైనందున
Published date : 24 Jan 2020 05:32PM