భారీగా పెరిగిన టోకు ధరలు..ఇదే తొలిసారి !
Sakshi Education
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.17 శాతంగా నమోదయ్యింది.
అంటే 2020 ఫిబ్రవరితో పోల్చితే 2021 ఫిబ్రవరిలో టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 4.17 శాతం పెరిగిందన్నమాట. గడచిన 27 నెలల్లో ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహారం, ఇంధనం, విద్యుత్ రంగాలు అన్నింటిలో ద్రవ్యోల్బణం పెరగడం గమనార్హం. 2021 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.03 శాతం ఉంటే, 2020 ఫిబ్రవరిలో 2.26 శాతంగా ఉంది.
Published date : 16 Mar 2021 05:27PM