Skip to main content

బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం :సీఎస్ జోషి

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గిగా స్కేల్ లి-అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు.
తెలంగాణలో ఈ పరిశ్రమ స్థాపనకు అన్నివిధాలా అనుకూలంగా, అవసరమైన 200 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఐదు గిగావాట్ల బ్యాటరీ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. 2023 నాటికి త్రిచక్ర, 2025నాటికి ద్విచక్ర వాహనాలను ఎలక్టిక్‌గ్రా మార్చడానికిగాను బ్యాటరీ పరిశ్రమలను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. వీటి ఎంపిక కోసం నీతిఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్‌కాంత్ అధ్యక్షతన వివిధ శాఖలతో కూడిన అంతర మంత్రిత్వ శాఖల నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల ఎంపిక అంశంపై జూన్ 7న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి
ఎక్కడ : తెలంగాణ
Published date : 08 Jun 2019 06:25PM

Photo Stories