బుకర్ ప్రైజ్-2020ను గెలుచుకున్ను స్కాటిష్ రచయత?
Sakshi Education
స్కాటిష్-అమెరికన్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.
డగ్లస్ రచించిన తన ఆత్మకథ ‘‘షుగ్గీ బెయిన్’’కు ఈ అవార్డు దక్కింది. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా షుగ్గీబెయిన్ నవలను మలచారు. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో నగరంలో 1971, మే 31 జన్మించిన డగ్లస్ లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు.
బుకర్ ప్రైజ్ పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. బుకర్ ప్రైజ్ విజేతకు 50వేల పౌండ్ల(దాదాపు రూ. 49 లక్షలకుపైగా) నగదును అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుకర్ ప్రైజ్-2020విజేత
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : స్కాటిష్-అమెరికన్ రచయత డగ్లస్ స్టువార్ట్
ఎందుకు : షుగ్గీ బెయిన్ నవలను రచించినందుకుగాను

Published date : 21 Nov 2020 05:51PM