బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
Sakshi Education
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా పేరుపొందిన మాతా మహాదేవి (70) బెంగళూరులో మార్చి 14న కన్నుమూశారు.
ఆమె కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్నారు. అనేక మఠాలకు, పీఠాలకు నెలవైన కర్ణాటకలో ఏకైక మహిళా సాధ్విగా మహాదేవి చోటు సంపాదించారు. బాగల్‌కోటె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా ఆమె బసవధర్మ పీఠాన్ని నిర్మించిన బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దసంఖ్యలో పీఠ శాఖలు, లక్షలాది మంది భక్తులు, అనుచరులకు ఆమె మాటే వేదవాక్కు. చిత్రదుర్గ జిల్లాలో జన్మించిన మహాదేవి కళాశాల విద్య తరువాత లింగాయత్ సన్యాస దీక్షను స్వీకరించారు. మంచి వాక్పటిమ, ధైర్యం ఆమె సొంతం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : మాతా మహాదేవి
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : బసవ పీఠాధిపతి మాతా మహాదేవి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : మాతా మహాదేవి
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు బీపీ, మూత్ర పిండ సమస్యలతో
Published date : 15 Mar 2019 06:18PM