బరోడా క్రికెట్ జట్టు కోచ్ అతుల్ సస్పెండ్
Sakshi Education
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే సస్పెండ్ అయ్యారు.
తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమ్ క్రికెటర్లతో అతుల్ అసభ్యకరంగా ప్రవర్తించినందునే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్లు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) మార్చి 21న తెలిపింది. ప్రస్తుతానికి అతుల్‌ను సస్పెండ్ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థారుు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది. 53 ఏళ్ల అతుల్ బెదాడే 1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్ సస్పెండ్
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : అతుల్ బెదాడే
ఎందుకు : టీమ్ క్రికెటర్లతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్ సస్పెండ్
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : అతుల్ బెదాడే
ఎందుకు : టీమ్ క్రికెటర్లతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు
Published date : 23 Mar 2020 06:33PM