బ్రిటన్‌లో ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
Sakshi Education
నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గణిత మేధావులకు ‘అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా’ను అందిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 27న ప్రకటించారు. ఈ తాజా వలస నిబంధనలను జనవరి 30న ప్రకటిస్తామని, 2020 ఫిబ్రవరి 20 నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. తాజా నిర్ణయం దిశగా భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత, బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ కృషి చేశారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్‌ను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
ఎందుకు : నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
ఎందుకు : నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు
Published date : 28 Jan 2020 05:37PM