బ్రిటన్ ప్రధానమంత్రి భారత పర్యటన వాయిదా
Sakshi Education
2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు హాజరు కావాల్సిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనవరి 5న ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్‌లో కొత్త కరోనా కేసులు ఉధృతరూపం దాల్చడంతో తాను భారత్‌కి రాలేకపోతున్నానని మోదీ తెలిపారు. అయితే యూకే ఆధ్వర్యంలో 2021 ఏడాది చివర్లో జరిగే జీ-7 సదస్సు కంటే ముందుగానే భారత్‌కి వస్తానని చెప్పారు.
Published date : 06 Jan 2021 05:41PM