బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం
Sakshi Education
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది.
బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్)లోని మొత్తం 650 సీట్లకుగాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లకు పరిమితమైంది. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకై క నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. 1983 ఎన్నికల్లో థాచర్ ఆధ్వర్యంలో కన్జర్వేటివ్ పార్టీ 397 స్థానాలు గెలుచుకుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జాన్సన్ మాట్లాడుతూ.. ఈ చారిత్రక విజయంతో 2020 జనవరి 31వ తేదీలోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు అవకాశం లభించిందని తెలిపారు.
అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు
2019, అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా 2019, జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో డిసెంబర్ 12న జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు.
బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
- మొత్తం సీట్లు 650
నోట్: బ్రాకెట్లలోనివి గత ఎన్నికల్లో పొందిన సీట్లతో పోల్చితే తేడా
ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జాన్సన్ మాట్లాడుతూ.. ఈ చారిత్రక విజయంతో 2020 జనవరి 31వ తేదీలోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు అవకాశం లభించిందని తెలిపారు.
అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు
2019, అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా 2019, జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో డిసెంబర్ 12న జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు.
బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
- మొత్తం సీట్లు 650
పార్టీ | సాధించిన సీట్లు |
కన్జర్వేటివ్ పార్టీ | 365(+47) |
లేబర్ పార్టీ | 203 (-59) |
స్కాటిష్ నేషనల్ పార్టీ | 48 (+13) |
లిబరల్ డెమొక్రాట్ | 11(-1) |
డీయూపీ | 8 (-2) |
ఇతరులు | 15 (+2) |
Published date : 14 Dec 2019 05:35PM