Skip to main content

బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్?

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఇంగ్లిష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ ప్రచురణ కేంద్రం (పబ్లిషింగ్ హౌస్) ఎడిటోరియల్ బోర్డులో సభ్యత్వానికి ఎంపికయ్యారు.
Current Affairs
తద్వారా ఈ ఘనత పొందిన తొలి భారతీయ ప్రొఫెసర్‌గా నిలిచారు. బ్రిల్ నుంచి రానున్న క్రిటికల్ పోస్త్‌హ్యూమనిజం’అనే ఈ-పుస్తక ధారావాహికకు ఆయన ఎంపికయ్యారు. ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. హెచ్‌సీయూలోనే ప్రొఫెసర్ ప్రమోద్ విద్యనభ్యసించారు.

1683లో ప్రారంభం...
నెదర్లాండ్‌‌సలోని లీడెన్ నగరంలో 1683లో బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ప్రారంభమైంది. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంటర్నేషనల్ లా, సైన్స్ లోని కొన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రచురణలను ఈ సంస్థ వెలువరిస్తుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : హెచ్‌సీయూ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్
ఎందుకు : ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా
Published date : 09 Jan 2021 05:58PM

Photo Stories