బ్రహ్మోస్-సుఖోయ్ అనుసంధానం వేగవంతం
Sakshi Education
40కి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తోపాటు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)లు సంయుక్తంగా ఈ పనులు చేపడుతున్నాయి. 2020లోపు ఈ పనులు పూర్తవ్వాల్సి ఉండగా, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్రహ్మోస్-సుఖోయ్‌ల అనుసంధానం పూర్తయితే ఆసియా ప్రాంతంలో కదన రంగంలో వాయుసేన శక్తి సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని ఐఏఎఫ్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మోస్-సుఖోయ్ అనుసంధానం వేగవంతం
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : కేంద్రప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మోస్-సుఖోయ్ అనుసంధానం వేగవంతం
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 10 Jun 2019 06:08PM