బ్రహ్మోస్ క్షిపణి బూస్టర్ పరీక్ష విజయవంతం
Sakshi Education
బ్రహ్మోస్ క్షిపణిలో అమర్చే కీలకమైన స్వదేశీ తయారీ బూస్టర్ పరీక్ష విజయవంతమైంది.
ఈ బూస్టర్‌తోపాటు ఎయిర్‌ఫ్రేమ్ సెక్షన్, మరికొన్ని ఇతర భాగాలనూ పూర్తిగా భారత్‌లోనే తయారుచేశారు. వీటిని అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని సెప్టెంబర్ 30న ఒడిశాలోని బాలాసోర్ పరీక్ష కేంద్రం నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రయోగించింది. క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు ధ్వని వేగం కంటే 2.8 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించిందని డీఆర్‌డీవో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు కావాల్సిన బూస్టర్లు, ఇతర పరికరాలను దేశీయంగానే తయారుచేసుకొనే వీలు కలుగుతుందని డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మోస్ క్షిపణి బూస్టర్ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : బాలాసోర్, ఒడిశా
ఎందుకు : బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు కావాల్సిన బూస్టర్లు, ఇతర పరికరాలను దేశీయంగానే తయారుచేసుకొనేందుకు

Published date : 01 Oct 2020 05:19PM