Skip to main content

బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.
Current Affairsహౌజ్ ఆఫ్ కామన్స్ లో జనవరి 9న జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. దీంతో 2020 జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు అవకాశం కలిగింది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు.

వాదోపవాదాలు..
బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : బ్రిటన్ పార్లమెంటు

మాదిరి ప్రశ్నలు
Published date : 10 Jan 2020 05:50PM

Photo Stories