బ్రెగ్జిట్ గడువు పొడిగింపునకు ఈయూ ఆమోదం
Sakshi Education
బ్రెగ్జిట్‌పై 2019, అక్టోబర్ 31న వరకు ఉన్న గడువును 2020, జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ అక్టోబర్ 28న ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో... ఈయూ తాజా నిర్ణయం తీసుకుంది.
Published date : 29 Oct 2019 05:45PM