బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
Sakshi Education
బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించే ‘త్రైపాక్షిక ఒప్పందం’పై కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు జనవరి 27న సంతకాలు చేశాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, బోడో సంఘాల నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం చాలాకాలం నుంచి బోడో ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది చేయకపోయినా, ఇతర అంశాలతో తాజా ఒప్పందం ఖరారైంది.
ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది. వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుంది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాండ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
త్రైపాక్షిక ఒప్పందం-ప్రధానాంశాలు
27 ఏళ్లలో మూడోసారి..
ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి.
తొలి ఒప్పందం: పరిమిత రాజకీయాధికారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది.
రెండో ఒప్పందం : రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది.
మూడో ఒప్పందం : బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కేంద్రప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించేందుకు

- ఆయుధాలు విడిచిపెట్టే ఎన్‌డీఎఫ్‌బీ ఉద్యమకర్తలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తాయి.
- వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేస్తాయి.
- బోడోల్యాండ్‌ను ఇకపై బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి(బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్-బీటీసీ)గా పిలుస్తారు.
- రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని, బరామాలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతారు.
- ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వాటిలో అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ), యునెటైడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి.
27 ఏళ్లలో మూడోసారి..
ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి.
తొలి ఒప్పందం: పరిమిత రాజకీయాధికారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది.
రెండో ఒప్పందం : రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది.
మూడో ఒప్పందం : బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కేంద్రప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించేందుకు
Published date : 28 Jan 2020 05:46PM