బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనా విజయం
Sakshi Education
బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 30న జరిగిన 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధించింది.
ఈ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 31న వెల్లడించింది. మొత్తం 300 పార్లమెంటు స్థానాలకుగాను 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయం సాధించాయి. విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్‌యూఎఫ్) ఏడు స్థానాల్లో గెలుపొందింది. దీంతో బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనుంది.
నైరుతి గోపాల్‌గంజ్ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్‌యూఎఫ్ అభ్యర్థికి 123 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ కుమార్తె అయిన హసీనా 1947, సెప్టెంబర్ 28న తూర్పుపాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని తుంగిపరాలో జన్మించింది. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్‌ను 1968లో పెళ్లి చేసుకున్న ఆమె 1981లో అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : హసీనా నేతృత్వంలోని మహాకూటమి

Published date : 01 Jan 2019 06:05PM