బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య ఒప్పందం
Sakshi Education
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.
ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 11న పార్లమెంటులో వెల్లడించారు. పాంగాంగ్ సో సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకుంటాయి. పాంగాంగ్ సో సరస్సు వద్ద జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనాల మధ్య ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనాల మధ్య ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా
Published date : 12 Feb 2021 06:26PM