బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత
Sakshi Education
బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్‌టీ(వస్తుసేవల పన్ను)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 12న ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో కోవిడ్ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు...
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు...
- హ్యాండ్ శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, బీఐపీఏపీ మెషీన్, టెస్టింగ్ కిట్, టెంపరేచర్ చెక్ చేసే పరికరాలుసహా 18 వస్తువులపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు.
- కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రస్తుతమున్న 5 శాతం పన్ను అలాగే కొనసాగనుంది.
- బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్–బి ఔషధంతో పాటు, టోసిలిజుమాబ్‌పై జీఎస్టీ పన్ను రేటు తొలగింపు. గతంలో ఈ రెండు ఔషధాలపై 5 శాతం జీఎస్‌టీ ఉండేంది.
- అంబులెన్స్ సేవలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు.
- హెపారిన్, రెమ్‌డెసివిర్ వంటి యాంటీ కోగ్యులెంట్ల జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
- తాజాగా తగ్గిన జీఎస్‌టీ రేట్లు 2021, సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
Published date : 15 Jun 2021 08:07PM