బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
Sakshi Education
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకివచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
దీంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది.
విలీనం తర్వాత బీవోబీ వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గా ఉంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Published date : 01 Apr 2019 05:19PM