Skip to main content

బీసీసీఐకి నష్టపరిహారం చెల్లించిన పాక్ క్రికెట్ బోర్డు

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సుమారు రూ.11 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు)ను నష్టపరిహారంగా చెల్లించింది.
ఈ మేరకు మార్చి 18న పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి వెల్లడించారు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత బోర్డు ఉల్లంఘించిందంటూ దావా వేసి ఓటమిపాలైనందుకు పీసీబీ ఈ నష్టపరిహారాన్ని చెల్లించింది. న్యాయపరమైన ఖర్చులు, ఇతర నష్టం మొత్తం కలిపి 1.6 మిలియన్ డాలర్లు చెల్లించింది.

2015 నుంచి 2023 మధ్య కాలంలో భారత్, పాక్ మధ్య కనీసం ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విధంగా బీసీసీఐ తమతో ఒప్పందం కుదుర్చుకుందని, అయితే దీనిని ఉల్లంఘించిన కారణంగా తమకు 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 490 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని పాక్ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేసింది. అయితే చివరకు కేసు ఓడిపోయి ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీసీసీఐకి నష్టపరిహారం చెల్లింపు
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)
Published date : 19 Mar 2019 04:58PM

Photo Stories