బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా నియమితులైన మాజీ డీజీపీ?
Sakshi Education
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌గా గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ షెకాదమ్‌ను నియమించారు.
ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న అజిత్ సింగ్ స్థానంలో షబ్బీర్ బాధ్యతలు చేపడతారని ఏప్రిల్ 5న బీసీసీఐ తెలిపింది. మూడేళ్ల నాటినుంచి ఏసీయూ చీఫ్‌గా పని చేస్తున్న అజిత్ సింగ్ పదవీ కాలం మార్చి 31న ముగిసింది. 2010లో రిటైర్ అయిన 70 ఏళ్ల షబ్బీర్ హుస్సేన్ పదేళ్ల పాటు ఎసార్ గ్రూప్‌లో సలహాదారుడిగా పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్‌పాల్ సెర్చ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ షెకాదమ్
ఎందుకు : ఏసీయూ చీఫ్‌గా పని చేస్తున్న అజిత్ సింగ్ పదవీ కాలం మార్చి 31న ముగియడంతో...

Published date : 06 Apr 2021 06:21PM