బీపీఆర్‌డీ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా
Sakshi Education
ఢిల్లీలో ఉన్న పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 29 Aug 2019 05:46PM