బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్ టీవీ ఒప్పందం
Sakshi Education
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో యప్ టీవీ ఒక అవగాహన ఒప్పందం కుదర్చుకుంది.
న్యూఢిల్లీలో అక్టోబర్ 21న జరిగిన కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పీకే పుర్వార్, యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్ సిరిస్, ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి సేవలను అందిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : యప్ టీవీ
ఎందుకు : బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : యప్ టీవీ
ఎందుకు : బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందించేందుకు
Published date : 22 Oct 2019 05:26PM