బీఎఫ్‌ఐ నేపాల్‌తో జేఎన్‌ఐబీఎఫ్ ఒప్పందం
Sakshi Education
నేపాల్‌కి చెందిన బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేపాల్(బీఎఫ్‌ఐఎన్)తో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (జేఎన్‌ఐబీఎఫ్) సహకార ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం అందించుకుంటాయి. అలాగే భారత్, నేపాల్‌లలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి సంయుక్తంగా సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఒప్పంద పత్రాలపై జేఎన్‌ఐబీఎఫ్ డెరైక్టర్ శ్రీకుమార్ నీల్ లోహిత్, బీఎఫ్‌ఐఎన్ ఎండీ బినోద్ ఆత్రేయ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేపాల్(బీఎఫ్‌ఐఎన్)తో ఒప్పందం
ఎవరు : హైదరాబాద్‌లోని జేఎన్‌ఐబీఎఫ్
ఎందుకు : బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేపాల్(బీఎఫ్‌ఐఎన్)తో ఒప్పందం
ఎవరు : హైదరాబాద్‌లోని జేఎన్‌ఐబీఎఫ్
ఎందుకు : బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం కోసం
Published date : 06 Mar 2020 05:45PM