బిహార్‌లో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్
Sakshi Education
బిహార్‌లో ‘ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన’ పేరుతో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.
దీంతో ఈ విధమైన పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా బిహార్ నిలిచింది. 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తీ తన ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం, కులాలకు అతీతంగా పెన్షన్‌ను అందుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వృద్ధులు లేదా ఎస్సీ, ఎస్టీ, వితంతువులు, వికలాంగులు మాత్రమే ఈ పథకాన్ని అందుకుంటున్నారు.
వృద్ధజన్ పెన్షన్ యోజన ద్వారా 80 ఏళ్లుపై బడిన వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.500 వేస్తారు. 60 నుంచి 80 మధ్య ఉన్న వారి ఖాతాల్లో రూ.400 వేస్తారు. పదవీ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగానే పెన్షన్ వస్తుంది. వారికి ఈ పెన్షన్ పథకం వర్తించదు. ఈ పథకం కోసం రూ.18,000 కోట్ల ప్రత్యేక నిధులను బిహార్ ప్రభుత్వం కేటాయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన పథకం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
ఎక్కడ : బిహార్

Published date : 15 Jun 2019 06:25PM