Skip to main content

బిహార్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య?

2020 ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
Current Affairsనవంబర్ 10న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా.. ఎన్డీయే 125 చోట్ల విజయం సాధించింది. ఎన్డీయేలోని... బీజేపీ 74, జేడీయూ 43, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి.

మహా కూటమిలో...
విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 110 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. మరోవైపు వాల్మీకినగర్ (బిహార్) లోక్‌సభ ఉప ఎన్నికలో జేడీయూ విజయం సాధించింది.

దుబ్బాకలో బీజేపీ విజయం...
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,65,645 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : అధికార ఎన్డీయే కూటమి
Published date : 11 Nov 2020 06:07PM

Photo Stories