Skip to main content

బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణం చేసిన నేత?

బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్ యునెటైడ్(జేడీయూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairs

బిహార్ రాజధాని పట్నాలో ఉన్న రాజ్‌భవన్‌లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో నితీశ్‌తో రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్‌కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్‌ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బిహార్ అసెంబ్లీ-2020 ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: బిహార్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య?, బిహార్ ఎన్నికల ఫలితాలు-2020

2000లో తొలిసారి...

  • బిహార్‌లోని పట్నా జిల్లా భక్తియార్‌పూర్‌లో 1951, మార్చి 1న జన్మించిన నితిశ్ కుమార్... బిహార్ సీఎంగా తొలిసారి 2000, మార్చి 3న బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు.
  • ఐదేళ్ల తరువాత, జేడీయూ- బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు.
  • 2015 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు.
  • ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తాజాగా ఏడోసారి బాధ్యతలు చేపట్టారు.
  • బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : నితీశ్ కుమార్
ఎక్కడ : రాజ్ భవన్, పట్నా, బిహార్
Published date : 17 Nov 2020 05:23PM

Photo Stories