Skip to main content

బగ్రామ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?

అల్‌ఖైదా, తాలిబన్ల చెర నుంచి అఫ్ఘనిస్తాన్‌కు స్వేచ్ఛ ప్రసాదిస్తామంటూ వచ్చిన అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోతోంది.
Current Affairs
ఈ క్రమంలో... 20 ఏళ్లుగా తన సైన్యం చేతుల్లో ఉన్న బగ్రామ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ను ఖాళీ చేసి జూలై 2న అఫ్ఘన్‌ నేషనల్‌సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌కు అప్పగించింది. సెప్టెంబర్‌ 11 నాటికి అఫ్ఘన్‌ నుంచి పూర్తిగా అమెరికా బలగాలు వైదొలిగే క్రమంలో ఈ ఫీల్డ్‌ అప్పగింత జరిగింది. అమెరికా బలగాలతో పాటు అఫ్ఘన్‌లో ఉంటున్న నాటో దళాలు సైతం స్వదేశాలకు పోతున్నాయి.

బగ్రామ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ను 1950లో సోవియట్‌ యూనియన్‌ నిర్మించింది. పదేళ్లపాటు ఈ ఫీల్డు నుంచే రష్యా బలగాలు ముజాహిద్దీన్లతో పోరాడాయి. అనంతరం ఈ ఎయిర్‌ఫీల్డ్‌ శి«థిలమైంది. 2001లో యూఎస్, నాటో దళాలు దీన్ని బాగు చేశాయి. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచే అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాదులపై దాడులు చేసింది. యుద్ధం తీవ్రంగా ఉన్న 2012 సమయంలో దాదాపు లక్షన్నర మంది సైనికులతో హడావుడిగా ఉన్న అమెరికా దళాలిప్పుడు... 2500–3000కు తగ్గిపోయాయి.

లాడెన్‌ను హతమార్చిన తర్వాత...
డబ్ల్యూటీవోపై దాడి (9/11) నేపథ్యంలో... ఆగ్రహంతో ఊగిపోయిన అమెరికా.... బిన్‌ లాడెన్‌ సారథ్యంలోని అల్‌ఖైదాను, తాలిబన్లను మట్టుపెటడానికంటూ అఫ్ఘన్‌లో కాలుమోపింది. తమ ప్రధాన శత్రువు లాడెన్‌ను హతమార్చిన తర్వాత అమెరికా పోరాటం క్రమంగా వేడి తగ్గింది. 2014 తర్వాత అమెరికా సేనలు దాడులు చేయటం దాదాపు ఆపేశాయి. ఒక్క ఉగ్రవాద వ్యతిరేక దళాలు మాత్రమే చురుగ్గా ఉన్నాయి.
Published date : 03 Jul 2021 06:05PM

Photo Stories