బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్టు
Sakshi Education
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12న ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2020’ సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు మార్చి 13న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు ఆయన అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డుల వివరాలు
అవార్డుల వివరాలు
- మోస్ట్ డెడికేటెడ్ ఔట్‌లుక్ ఫర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది.
- టర్బో మేఘా ఎయిర్‌వేస్ (ట్రూజెట్) బెస్ట్ ఉడాన్ ఎయిర్‌లైన్ అవార్డు దక్కించుకుంది.
- 2.5 కోట్లకుపైగా ప్రయాణికుల విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డును బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అందుకుంది.
- బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అవార్డును (షెడ్యూల్డ్) విస్తారా స్వీకరించింది.
- ఏవియేషన్ సస్టేనబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అవార్డును స్పైస్‌జెట్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్వీకరించాయి.
Published date : 14 Mar 2020 05:57PM