బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో ఏ దేశ పార్లమెంట్ రద్దయింది?
Sakshi Education
ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం కుప్పకూలింది.
డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రికల్లా దేశ బడ్జెట్‌కి ఆమోదముద్ర వేయాల్సి ఉండగా ఆ పనిచేయలేకపోవడంతో పార్లమెంటు దానంతటదే రద్దయి్యంది. దీంతో దేశంలో మళ్లీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల వ్యవధిలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగుతుండటం ఇది నాలుగో సారి.
ఇదీ కథ...
2020, ఏప్రిల్‌లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీ, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీ కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధాని పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన తర్వాత గాంట్జ్‌కు పగ్గాలు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ మధ్యలోనే ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దేశ బడ్జెట్‌పై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో పార్లమెంట్ రద్దయింది.
నెతన్యాహు.. ఐదుసార్లు...
నెతన్యాహూ... 1996-99 మధ్య తొలిసారి ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు (2009, 2013, 2015, 2020) ఈ పదవిలో కొనసాగుతున్నారు.
ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలెం; కరెన్సీ: ఇజ్రాయెలి షెకెల్
ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు: రెయూవేన్ రివీలిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎందుకు : తుది గడువులోగా దేశ బడ్జెట్‌కి ఆమోదముద్ర వేయడంలో విఫలమైనందునఇదీ కథ...

Published date : 24 Dec 2020 06:36PM