బడ్జెట్ హల్వా తయారీలో నిర్మలా
Sakshi Education
కేంద్ర ఆర్థిక శాఖ పధాన కార్యాలయంలో జూన్ 22న జరిగిన ‘బడ్జెట్ హల్వా’ఉత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాధారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా తయారీతో ఆరంభిస్తారు. ఈ ఆనవాయితీలో భాగంగానే జూలై 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభించే కార్యక్రమానికి ముందు హల్వా ఉత్సవం చోటు చేసుకుంది.
హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బడ్జెట్ హల్వా ఉత్సవం
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం, న్యూఢి ల్లీ

Published date : 24 Jun 2019 06:30PM