Skip to main content

బాటా గ్లోబల్ సీఈవోగా నియమితులైన భారతీయుడు?

పాదరక్షల సంస్థ బాటాకు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత సంతతికి చెందిన సందీప్ కటారియా నియమితులయ్యారు.
Current Affairsబాటా ఇండియా సీఈవో హోదా నుంచి గ్లోబల్ సీఈవోగా ఆయన ప్రమోట్ అయ్యారు. శతాబ్దం పైగా చరిత్ర గల బాటా షూ ఆర్గనైజేషన్‌కు ఒక భారతీయుడు సీఈవోగా నియమితుడవడం ఇదే ప్రథమం. దాదాపు అయిదేళ్ల పైగా సీఈవో స్థానంలో కొనసాగిన అలెక్సిస్ నాసార్డ్ స్థానంలో సందీప్ నియమితులయ్యారు. సందీప్ సారథ్యంలో బాటా భారత విభాగం నిలకడగా వృద్ధి, లాభాలు నమోదు చేసింది.

126 ఏళ్లచరిత్ర..
స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బాటా సంస్థ 1894లో ఏర్పాటైంది. అయిదు ఖండాల్లో 22 సొంత తయారీ కేంద్రాలు ఉన్నాయి. 70 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 35,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5,800 స్టోర్స్‌లో ఏటా 18 కోట్ల జతల పాదరక్షలను విక్రయిస్తోంది. భారత్‌లో ఏటా సుమారు 5 కోట్ల జతల పాదరక్షలు విక్రయిస్తోంది.

తాజా పరిణామంతో ఎఫ్‌ఎంసీజీ మొదలుకుని ఐటీ సంస్థల దాకా పలు అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో కటారియా కూడా చేరారు.

టాప్ ఇండియన్ సీఈవోల్లో కొందరు

పేరు

కంపెనీ

సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్

సుందర్ పిచాయ్

గూగుల్

శంతను నారాయణ్

ఎడోబ్

అరవింద్ కృష్ణ

ఐబీఎం

లక్ష్మణ్ నరసింహన్

రెకిట్ బెన్‌కిసర్

ఇవాన్ మెనెజెస్

డయాజియో

అజయ్ బంగా

మాస్టర్‌కార్డ్

వసంత్ నరసింహన్

నోవార్టిస్

పునీత్ రంజన్

డెలాయిట్

పీయూష్ గుప్తా

డీబీఎస్


క్విక్ రివ్యూ :
ఏమిటి :
బాటాకు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులైన భారతీయుడు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సందీప్ కటారియా
Published date : 02 Dec 2020 06:10PM

Photo Stories