బార్సిలోనా జట్టుకు లా లిగా టైటిల్
Sakshi Education
యూరోపియన్ క్లబ్ టోర్నీలో ప్రతిష్టాత్మకమైన లా లి గా టైటిల్‌ను బార్సిలోనా జట్టు వరుసగా రెండో ఏడాది గెలుచుకుంది.
బార్సిలోనాలో ఏప్రిల్ 28న క్యాంప్ నౌలో లెవాంటె జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ మెస్సీ చేసిన ఏకైక గోల్‌తో బార్సిలోనా చాంపియన్‌గా నిలిచింది. వివిధ జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మరో మూడు మ్యాచ్‌లు మిగిలిన ఉండగానే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బార్సిలోనాకు ట్రోఫీ దక్కింది. దీంతో రియల్ మాడ్రిడ్(33) తర్వాత అత్యధిక లీగ్ టైటిళ్లు గెలిచిన జట్టుగా బార్సిలోనా(26) రికార్డు సృష్టించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లా లి గా టైటిల్ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : బార్సిలోనా జట్టు
ఎక్కడ : బార్సిలోనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : లా లి గా టైటిల్ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : బార్సిలోనా జట్టు
ఎక్కడ : బార్సిలోనా
Published date : 29 Apr 2019 05:23PM