బార్సిలోనా ఏటీపీ–500 టెన్నిస్ టోర్ని విజేత?
Sakshi Education
బార్సిలోనా ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు.
ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో నాదల్ 6–4, 6–7 (6/8), 7–5తో ప్రపంచ ఐదో ర్యాంకర్ స్టెఫనో సిట్సిపాస్ (గ్రీస్)పై నెగ్గాడు. దాంతో బార్సిలోనా టైటిల్‌ను నాదల్ 12వసారి గెలుచుకున్నట్లయింది. నాదల్ తొలిసారి 2005లో ఈ టైటిల్‌ను నెగ్గాడు. ఫ్రెంచ్ ఓపెన్ (13) తర్వాత అతను ఎక్కువ సార్లు గెలిచిన టోర్నీ ఇదే.
జలాంతర్గామి జలసమాధి
బాలి సముద్రంలో ఏప్రిల్ 21న గల్లంతైన జలాంతర్గామి ‘కేఆర్‌ఐ నంగల’ మునిగిపోయిందని, అందులోని 53మంది సిబ్బంది మృతి చెందినట్లేనని ఏప్రిల్ 24న ఇండోనేసియా నేవీ ప్రకటించింది. జలాంతర్గామి 655 అడుగుల వరకు నీటిలోపలకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ఈ ప్రమాదంలో అది దాదాపు 2000– 2300 అడుగుల లోతుకు మునిగి ఉంటుందని అంచనా వేసింది. ఈ స్థాయిల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేదని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బార్సిలోనా ఏటీపీ–500 టెన్నిస్ టోర్ని విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : రాఫెల్ నాదల్

Published date : 26 Apr 2021 07:51PM