బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది : ఆర్మీ చీఫ్
Sakshi Education
పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని భారత సైనికాధిపతి బిపిన్ రావత్ వెల్లడించారు.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సెప్టెంబర్ 23న నిర్వహించిన యువ సైనికుల నూతన శిక్షణ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా రావత్ ఈ విషయాన్ని తెలిపారు. బాలాకోట్ దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదుల చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ పేర్కొన్నారు.
Published date : 24 Sep 2019 05:44PM