Skip to main content

ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఆయుధ సవరణ బిల్లు-2019కు డిసెంబర్ 10న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును డిసెంబర్ 9న లోక్‌సభ ఆమోదించింది.
Current Affairsఈ బిల్లు ప్రకారం.. నిర్లక్ష్యంగా, మనుషులకు ప్రాణహాని కలిగేలా ఆయుధాన్ని ఉపయోగిస్తే రెండేళ్ల జైలు, లక్ష జరిమానా విధిస్తారు. ఒక వ్యక్తి ఇప్పటివరకు అత్యధికంగా మూడు తుపాకులు, లేదా సంబంధిత ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా, ఇకపై అత్యధికంగా రెండు మాత్రమే కలిగి ఉండే ప్రతిపాదనను ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ... వారసత్వంగా వచ్చిన ప్రాచీన ఆయుధాలను నిరుపయోగం చేసి, ఎన్నైనా  భద్రపరుచుకోవచ్చని తెలిపారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ఆయుధ సవరణ బిల్లు-2019కు ఆమోదం
 ఎప్పుడు : డిసెంబర్ 10
 ఎవరు : పార్లమెంట్
Published date : 11 Dec 2019 05:36PM

Photo Stories