అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
Sakshi Education
అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పుతో పాటు దాని సంబంధిత వ్యవహారాలను ఈ విభాగమే చూసుకోనుందని కేంద్ర హోంశాఖ జనవరి 2న వెల్లడించింది. అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో ఈ విభాగం పనిచేయనుందని తెలిపింది. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం హోంశాఖలోని కశ్మీర్, లదాఖ్ వ్యవహారాల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు
మాదిరి ప్రశ్నలు
1. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు 2019, నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన ధర్మాసనంలో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, దీనికి ఎవరు నేతృత్వం వహించారు?
1. ఆరుగురు, జస్టిస్ ఏస్ఏ బాబ్డే
2. నలుగురు, జస్టిస్ ఏస్ఏ నజీర్
3. ముగ్గురు, జస్టిస్ అశోక్ భూషణ్
4. ఐదుగురు, జస్టిస్ రంజన్ గొగోయ్
- View Answer
- సమాధానం : 4
2. అయోధ్య భూవివాదంపై తుది తీర్పు వెలువరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా లేరు?
1. జస్టిస్ అశోక్ భూషణ్
2. జస్టిస్ ఏస్ఏ నజీర్
3. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
4. జస్టిస్ ఏస్ఏ బాబ్డే
- View Answer
- సమాధానం : 3
Published date : 03 Jan 2020 05:56PM