Skip to main content

అయోధ్యపై కొత్త రాజ్యాంగ ధర్మాసనం

అయోధ్యలోని రామమందిరం-బాబ్రీమసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు జనవరి 25న ఐదుగురు సభ్యులతో కూడినకొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్యంలోని ఈ ధర్మాసనంలో సహా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. 2019, జనవరి 29 నుంచి ధర్మాసనం కేసును విచారించనుంది. ఇంతకుముందు ఏర్పాటు చేసిన ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ వైదొలగడంతో కొత్త ధర్మసనాన్ని ఏర్పాటు చేశారు.
2010లో ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారాకు, రామ్ లల్లాకు సమానంగా పంచాలని తీర్పు వెలువరించడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్య వివాదంపై కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 26 Jan 2019 08:01PM

Photo Stories