Skip to main content

అవినీతి సూచీలో భారత్‌కు 80వ స్థానం

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ‘అవినీతి సూచీ 2019(కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్‌కు 80వ స్థానం లభించింది.
Current Affairsఅవినీతిని అదుపుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 180 దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కోసం చెల్లిస్తున్న ముడుపుల వివరాలను ఈ నివేదికను రూపొందించారు. అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ తొలి స్థానంలో... ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్లర్లాండ్ వంటివి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకోలు 80వ స్థానంలో ఉన్నాయి.

పోటీతత్వ సూచీలో 72వ స్థానం
ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీ-2019లో భారత్ ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని 72వ స్థానంలో నిలిచింది. ప్రతిభను పెంచడం, ఆకర్షించడం, కాపాడుకోవడంలో ఆయా దేశాల సామర్థ్యాలను బేరీజు వేసి ఈ సూచీలో ర్యాంకులు కేటాయిస్తారు. 132 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్‌లు 2, 3 స్థానాలు దక్కించుకున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అవినీతి సూచీలో భారత్‌కు 80వ స్థానం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 24 Jan 2020 05:35PM

Photo Stories