Skip to main content

ఔష‌ధాల ఎగుమ‌తుల‌పై పాక్షికంగా నిషేధం ఎత్తివేత‌

ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
Current Affairs

మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీని ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. ఈ నేప‌థ్యంలో మానవతా దృక్పథంతో క్లోరోక్విన్‌ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : ఔష‌ధాల ఎగుమ‌తుల‌పై పాక్షికంగా నిషేధం ఎత్తివేత‌
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : భారత ప్రభుత్వం
Published date : 07 Apr 2020 05:58PM

Photo Stories